అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితమిది | Sakshi
Sakshi News home page

అయోధ్యలో నమో: ప్రపంచం యావత్తూ జనవరి 22 కోసం ఎదురుచూస్తోంది

Published Sat, Dec 30 2023 10:39 AM

PM Modi Visits Ayodhya Live Updates Telugu - Sakshi

PM Narendra Modi In Ayodhya Updates


ప్రపంచం యావత్తూ జనవరి 22 కోసం ఎదురుచూస్తోంది : ప్రధాని మోదీ
 

  • శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం నేను కూడా మీలాగే ఎదురుచూస్తున్నాం
  • ఒకప్పుడు అయోధ్యలో రాముడు టెంట్‌లో కొలువుదీరాడు
  • ఇప్పుడు రాముడికి గొప్ప మందిరం వచ్చింది
  • ఇది అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితం
  • అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలబెడతాం
  • వారసత్వం మనకు సరైన మార్గం చూపిస్తుంది
  • అభివృద్ధి చెందాలంటే వారసత్వాన్ని కాపాడుకోవాలి
  • కొన్ని రోజుల్లో అయోధ్యలో వారసత్వం వెల్లివిరుస్తుంది
  • ఇకపై అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య ఐదురెట్లు పెరుగుతుంది
  • అయోధ్య ఎయిర్ పోర్ట్ చూసి ప్రతి ఒక్కరూ పులకించిపోతారు 
  • మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్‌ ప్రాంగణంలో జరిగిన జన్‌ సభలో భావోద్వేగంగా ప్రధాని మోదీ 

అయోధ్య బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
 

  • యూపీకి సంబంధించి రూ.15,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని


అయోధ్యకు ఎగిరిన తొలి విమానం

  • టేకాఫ్‌ అనౌన్స్‌ చేసిన ఇండిగో పైలట్‌ కెప్టెన్‌ అశుతోష్‌ శేఖర్‌
  • కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్న తొలి విమానం

  • అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

  • అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్న ‍ప్రధాని మోదీ.. కాసేపట్లో ప్రారంభం

జై శ్రీరామ్‌తో మారుమోగిపోతున్న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌

  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జై రామ్‌.. శ్రీరామ్‌ నినాదాలు
  • అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను మరికాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • ఢిల్లీ నుంచి ప్రయాణికులతో అయోధ్య చేరుకోనున్న తొలి విమానం
  • రామాయణం రచించిన మహర్షి వాల్మీకి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టిన కేంద్రం

ఆ ఇద్దరికి సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్‌లు

  • యూపీ అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీని కలిసిన ఇద్దరు చిన్నారులు
  • చిన్నారులకు సెల్ఫీ ఫోజులు ఇచ్చిన ప్రధాని మోదీ
  • ఆటోగ్రాఫ్‌లిచ్చి కాసేపు వాళ్లతో ముచ్చటించిన ప్రధాని


కాసేపట్లో అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం

  • అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం
  • మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అయోధ్య ధామ్‌గా నామకరణం
  • కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • జనవరి 6వ తేదీ నుంచి విమానాల రాకపోకలు షురూ
  • దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వాల్మీకి ఎయిర్‌పోర్ట్‌కి విమానాలు


 

  • అయోధ్య లతా మంగేష్కర్‌ చౌక్‌లో సందడి చేసిన ప్రధాని మోదీ



 




ఆమె ఇంట్లో ఛాయ్‌ తాగిన ప్రధాని మోదీ 

  • అయోధ్య పర్యటనలో మోదీ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు 
  • ఉజ్వల యోజన లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లారు
  • ఆమె ఇంట్లో టీ తాగి.. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు
  • పీఎం ఉజ్వల యోజన కింద 10 కోట్ల మంది లబ్ధిదారులున్న సంగతి తెలిసిందే


 

  • కాసేపట్లో అయోధ్య ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అమృత్‌ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని

  • రెండు అమృత్‌ భారత్‌ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
  • అంతకు ముందు.. రైలులోని విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ
  • అయోధ్య పర్యటనలో రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ


అయోధ్య ధామ్‌ జంక్షన్‌ ప్రారంభం

  • అయోధ్య రైల్వే స్టేషన్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ
  • అయోధ్య ధామ్‌ జంక్షన్‌గా అయోధ్య రైల్వే స్టేషన్‌కు నామకరణం
  • రూ.240 కోట్లతో పునరుద్ధరణ పనులు
  • అయోధ్య మందిర చిత్రాలతో.. హైటెక్‌ హంగులతో స్టేషన్‌
  • మూడు అంతస్థులతో అయోధ్య జంక్షన్‌ పునర్నిర్మాణం


దారిపొడవునా.. ప్రధానికి సాదర స్వాగతం

  • ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో కొనసాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన 
  • రైల్వే స్టేషన్‌ వరకు 15 కిలోమీటర్ల దూరం మెగా రోడ్‌ షో
  • దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం
  • మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారుల ప్రదర్శన
  • ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్‌ను కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అయోధ్య ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం


అయోధ్యలో ప్రధాని మోదీ మెగా రోడ్‌ షో

  • అయోధ్య పర్యటనలో మెగా రోడ్‌షోలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • దారికి ఇరువైపులా బారులు తీరిన జనం
  • అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రధాని మోదీ 
  • మోదీకి ఘనంగా స్వాగతం 
  • ప్రత్యేక ఆకర్షణగా.. సాంస్కృతిక కళల ప్రదర్శన


రాముడు అందరివాడు: ఫరూక్‌ అబ్దుల్లా

  • అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై జమ్ము మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా స్పందన
  • అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది
  • అందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు
  • రాముడు కేవలం హిందువులకే దైవం కాదు.. ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ దేవుడే.. అది పుస్తకాల్లోనూ రాసి ఉంది
  • ప్రజలంతా మత, భాష బేధాలు లేకుండా సోదరభావంతో, ప్రేమతో, ఐక్యంగా ఉండాలని శ్రీరాముడు విశ్వ సందేశం ఇచ్చారు
  • కాబట్టి ఆలయం ప్రారంభం అయ్యే సమయంలో అంతా సోదరభావంతో మెలగాలి


     

అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ

  • ప్రధానికి రాష్ట్ర గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం
  • ఎయిర్‌పోర్టు నుంచి 15 కిలోమీటర్లు సాగే రోడ్‌ షోలో పాల్గొననున్న మోదీ

కాసేపట్లో అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

కాసేపట్లో ప్రధాని అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఘనస్వాగతంతో ముందుకు సాగుతారు. ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్‌ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్‌ సభ’లో మాట్లాడతారు. ఈ సభకు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశముంది. సభానంతరం ప్రధాని తిరుగు పయనమవుతారు

అయోధ్యలో నాలుగు గంటలపాటు ఉండనున్న  ప్రధాని

అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11,100 కోట్ల ప్రాజెక్టులను, యూపీలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి రూ.4,600 కోట్ల పనులను ప్రారంభిస్తారు. అలాగే రామ మందిరానికి చేరుకునేలా కొత్తగా పునరుద్ధరించిన నాలుగు రహదారుల ప్రారంభం కూడా ప్రధాని షెడ్యూలులో ఉన్నట్లు పీఎంవో తెలిపింది.

ఉత్తర ప్రదేశ్‌ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో నేడు అత్యాధునిక ఎయిర్‌పోర్ట్‌, ఆధునిక హంగులు సంతరించుకున్న రైల్వే స్టేషన్‌ ప్రారంభం

రామమందిర శంకుస్థాపనకు ముందే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన  అయోధ్య రైల్వే స్టేషన్‌ ప్రారంభం కావడం గమనార్హం

► ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన

మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రత పటిష్టం   

డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీలు.. డ్రోన్లతో నిఘా 

పూలతో అందంగా ముస్తాబైన అయోధ్య 

అయోధ్యలో రూ.1,450 కోట్లతో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం 

6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్‌ భవనం

ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు

‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అయోధ్యధామం’గా పేరు 

  • ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్‌ జంక్షన్‌’గా నామకరణం
  • శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు సుందర నిర్మాణాలు 
  • శిఖరం, విల్లు బాణం వంటి గుర్తులు 
  • నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్‌ విస్తరణ
  • రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్‌ ఇండియా టెక్నికల్, ఎకనామిక్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(రైట్స్‌) ఆధ్వర్యంలో అభివృద్ధి 

మరోవైపు.. అయోధ్యలో ఊపందుకున్న భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు

అయోధ్య నగరానికి 15 కి.మీ.ల దూరాన ఉన్న ఎయిర్‌పోర్టు నుంచి రైల్వేస్టేషనుకు వెళ్లే మార్గం పొడవునా ప్రధాని రోడ్‌షో ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ మార్గంలో ఏర్పాటుచేసే 40 వేదికలపై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

Advertisement
Advertisement