కమలా ‍హారీస్‌కు రాజయోగం? | Famous Astrologer Rajeev Narain Sharma Predicts That Kamala Harris Become The President Of America | Sakshi
Sakshi News home page

కమలా ‍హారీస్‌కు రాజయోగం?

Jul 22 2024 9:46 AM | Updated on Jul 22 2024 10:21 AM

Kamala Harris Become the President of America

రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించినంతనే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బైడెన్‌ తన ప్రకటన అనంతరం అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పేరును ఆమోదించారు. దీంతో భారత సంతతికి చెందిన కమలా హారీస్ అమెరికా అధ్యక్షురాలిగా కాబోతున్నారనే వాదన ఒక వర్గం నుంచి వినిపిస్తోంది.

తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు రాజీవ్ నారాయణ్ శర్మ  అమెరికా అధ్యక్షురాలిగా హారీస్‌ ఎన్నిక కానున్నారని జోస్యం చెప్పడంతో ఈ తరహా  ఊహాగానాలు మరింతగా జోరందుకున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాజీవ్ నారాయణ్ శర్మ.. కమలా హారీస్ భవిష్యత్‌ గురించి తెలిపారు.  ఆమె జాతకంలో ప్రస్తుతం రాహు, శుక్ర దశ జరుగుతోందని, ఆమెకు రాజయోగం ఈ ఏడాది జూలై 27 నుండి ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ సమయం కమలా హారీస్‌ జీవితంలో బంగారు దశ అవుతుందన్నారు.

జ్యోతిష్కులు రాజీవ్ నారాయణ్ శర్మ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విషయమై కూడా జోస్యం చెప్పారు. బైడెన్‌ 1942, నవంబర్‌ 11న జన్మించారని, అతనిది వృశ్చిక రాశి అని, ప్రస్తుతం అతని జాతకంలో శని దశ నడుస్తున్నదన్నారు. అలాగే  కుజుడు, బుధుడు పెన్నెండవ ఇంట కలిసి ఉన్నారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో అది మనస్సును ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఈ నేపధ్యంలోనే అతను ఎన్నికల బరి నుంచి నుంచి తప్పుకుని ఉండవచ్చన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement