మూడు దశాబ్దాలుగా పీడిస్తున్న పీడకల

Bhopal Gas Tragedy Completed 36 Years - Sakshi

భోపాల్‌ దుర్ఘటనకు 36 ఏళ్లు

ఏళ్లు గడుస్తున్న బాధితులకు దక్కని పరిహారం

భోపాల్‌ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న గ్యాస్ దుర్ఘటన ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. నాటి ప్రమాదంలో చిక్కుకున్న బాధితుల వెతలు ఈ నాటికీ తగ్గలేదు. గడచిన 30 ఏళ్లలో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు ఎన్నో మారినప్పటకీ బాధితులకు కనీన న్యాయం దక్కలేదు. గ్యాస్ బాధితుల పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. సరైన తాగునీటి వసతి కూడా లేక అల్లాడిపోతున్నారు. 1984, డిసెంబరు 2, 3 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసీఐఎల్) పురుగుమందుల ప్లాంట్‌లో గ్యాస్‌లీకేజీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన సంభవించిన నేటికి 36 ఏళ్లు ముగిసిన నేపథ్యంలో భోపాల్‌ బాధితులు ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2006లో కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్  ప్రకారం.. ఈ విషాదంలో 3,787 మంది మృతి చెందగా, మరో 5.58 లక్షల మందిపై ప్రభావం చూపింది. అయితే బాధితుల కోసం పోరాడుతున్న సంస్థలు ఈ విషాదంలో కనీసం 25 వేల మంది మరణించారని పేర్కొన్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2019 ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 1984 భోపాల్ గ్యాస్ విషాదం 20వ శతాబ్దంలో ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా పేర్కొంది. యూనియన్ కార్బైడ్ (పురుగుమందుల) కర్మాగారం నుంచి విడుదలైన 30 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ వాయువు 6,00,000 మంది కార్మికులను, సమీప నివాసులను ప్రభావితం చేసిందని నివేదిక పేర్కొంది. ఈ విషాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు తగిన పరిహారం, సరైన పునరావాసం కల్పించి, ప్రాణాలతో బయటపడినవారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని, ఆ ప్రాంతంలో పడిన విష రసాయనాలను తొలగించాలని అనేక సంస్థలు  దశాబ్దాలుగా బాధితుల తరుపున పోరాడుతున్నాయి.

ఈ కేసులో ఎనిమిది మంది నిందితులకు 2010 జూన్ మొదటి వారంలో భోపాల్ కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ .1.7 లక్షల జరిమానా విధించింది. నిందితులకు బెయిల్‌ కూడా లభించింది. దీంతో ఈ తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేసినట్లు ఉందని ప్రాణాలతో బయటపడిన వారు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వారెన్ అండర్సన్. భోపాల్‌ గ్యాస్‌ విషాదాన్ని చూడటానికి వచ్చి సురక్షితంగా దేశం విడిచి వెళ్లాడు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనికి మార్గం సుగమం చేసిందనేది ప్రధాన ఆరోపణ. వారెన్ అండర్సన్ భారత కోర్టులలో ఎటువంటి విచారణను ఎదుర్కోకుండానే 2014 సెప్టెంబర్‌లో అమెరికాలోని ఫ్లోరిడాలో మరణించారు. (చదవండి: ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో 26 పులులు మృతి)

బాధితులకు అందని పరిహారం : రచనా ధింగ్రా
“రాష్ట్రంలో, కేంద్రంలో అప్పుడు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ బతికున్నవారి కోసం ఏం చేయలేదు. బాధితులకు పరిహారం అందించడం, పునరావాసం కల్పించడం, ప్రాణాలతో బయటపడినవారికి వైద్య చికిత్స అందిచడం, దోషులకు శిక్ష పడేట్లు చేయడం, విషపూరిత రసాయనాలను తరలించడం వంటి వాటిని ప్రభుత్వాలు విస్మరిస్తూనే ఉన్నాయి. మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసి)వల్ల కలిగే గాయాలు శాశ్వతమైనవని వివిధ నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ 90% మంది బాధితులకు పరిహారంగా కేవలం 500 యుఎస్ డాలర్లు మాత్రమే చెల్లించారు.  ఈ గ్యాస్‌ ప్రభావంతో హైపర్గ్లైకేమియా (డయాబెటిస్), యురేమియా (మూత్రపిండ వ్యాధులు), పల్మనరీ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల వ్యాధులు & అసిడోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) వాయువు సాంద్రత 21 పీపీఎం (మిలియన్‌కు భాగాలు) మించి ఉంటే దాన్ని పీల్చిన కొద్ది నిమిషాల్లోనే ప్రాణం పోతుంది. దశాబ్దాలుగా ప్రాణాలతో బయటపడిన వారి మరణాలకు, వికలాంగులుగా మారడానికి కారణం ఇదే.’’ అని భోపాల్ సమాచార, చర్యల వ్యవస్థాపక సభ్యురాలు రచనా ధింగ్రా అన్నారు.

దశాబ్దాలుగా దక్కని న్యాయం
బాధితులలో ఒకరైన బ్యాంకర్ జగదీష్ దుబే మాట్లాడుతూ.. “భోపాల్ గ్యాస్ విషాదాన్ని ప్రతిఏటా గుర్తుచేసుకోవడం బాధితులకు, ప్రభుత్వానికి ఒక ఆచారంగా మారింది. మా సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు వదిలేస్తున్నారు. మళ్లీ వచ్చే ఏడాది వారోత్సవాలు జరుపుతున్నారు. దీని వల్ల ‍ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. భోపాల్ గ్యాస్ పీడిట్ సంఘర్ష్ సహోగ్ సమితి అనే మరో హక్కుల సంస్థ కన్వీనర్ సాధనా కర్నిక్ మాట్లాడుతూ.. ‘‘ ప్లాంట్ నుంచి బయటికి వచ్చిన విష వాయువు నగర ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంది. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (బిఎమ్‌హెచ్‌ఆర్‌సి) నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ అక్కడ సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నం జరగడం లేదు.’’ అని కార్నిక్‌ అన్నారు. 

ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది!
భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ.. పరిహారానికి సంబంధించిన విషయం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ విషాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

కోవిడ్ -19 మరణాల రేటు 6.5 రెట్లు ఎక్కువ
ఆరోగ్య శాఖ అధికారిక రికార్డు ప్రకారం, భోపాల్ జిల్లాలోని గ్యాస్ ప్రభావిత ప్రాంతంలో కోవిడ్ -19 మరణాల రేటు 6.5 రెట్లు ఎక్కువ ”అని భోపాల్ గ్యాస్ పీడిట్ మహిలా పురుష్ సంఘర్ష్ మోర్చా అధ్యక్షుడునవాబ్ ఖాన్ అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top