
నాలాల్లో సగం కబ్జాలే..
మున్సిపాలిటీలో నాలాలు ఉండే వెడల్పులో వాస్తవ వెడల్పునకు 50 శాతానికి పైగా కబ్జా అవుతున్నాయనేది స్పష్టంగా కానవస్తుంది. నాలాలను పూర్తిస్థాయిలో విస్తరించినట్టయితే.. వరదలకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. వర్షం పడితే లోతట్టు ప్రాంతాల్లో, కొత్త కాలనీల్లో వరద నీటితో ఇబ్బందులు తప్పడం లేదంటూ జనం వాపోతున్నారు. ఇదిలాఉండగా, పట్టణంలో డ్రైనేజీలను ఆనుకొని కొందరు.. కబ్జా చేస్తు కొందరు అక్రమ కట్టడాలు నిర్మించారు. వాటిపై మున్సిపల్ అధికారులకు మౌఖిక ఫిర్యాదులు అందుతున్నా వాటిని తొలగించేందుకు ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితి కానవస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతో నాలాలు, డ్రెయినేజీలను అక్రమించుకొని అక్రమ కట్టడాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
నాలాలను కబ్జా చేస్తే చర్యలు
నిబంధనల మేరకే భవనాల నిర్మాణాలకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు ఇస్తున్నాం. డ్రెయిన్‌లపై, నాలాలను అక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే మున్సిపల్ శాఖ పరంగా చర్యలు తీసుకుంటాం.
– భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట