
కాళ్లు మొక్కుతా.. ఇల్లు మంజూరు చేయండి
కోస్గి రూరల్: నా భర్త మృతిచెందాడు.. కూతురి, నేను కూలి పనిచేసుకొని బతుకీడుస్తున్నాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి సారూ.. అంటూ ఓ మహిళ కమిషనర్ కాళ్లపై పడి ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం పట్టణంలోని 9వ వార్డు పరిదిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ నాగరాజు పర్యవేక్షిస్తుండగా చింతల్‌శెట్టి మణెమ్మ కమిషనర్‌ను కలిసింది. తమ ఇల్లు శిథిలావస్థకు చేరిందని, వెనుకభాగంలో కొంత కూలిపోయిందని, వర్షం పడితే ఇల్లు మొత్తం కురుస్తుండడంతో పైన ప్లాస్టిక్ కవర్ కప్పుకొని బతుకుతున్నామని తెలిపింది. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ ఒక్కసారిగా కమిషనర్ కాళ్లపై పడింది. స్పందించిన కమిషనర్ మహిళ కుటుంబ వివరాలు నమోదు చేసుకొని ఇల్లు మంజూరయ్యేలా చూస్తానని తెలిపారు.