
ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు
కోస్గి రూరల్: మున్సిపాలిటీ ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. కోస్గి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రెవె న్యూ మేళాకు ట్రెయినీ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి మార్పిడి, ఆస్తిపన్ను హెచ్చుతగ్గులు, యజ మాని పేరు, ఇంటి నంబర్ సరిచేయడం, కొత్తగా ఇంటి నంబర్లు జారీ చేయడం తదితర వాటిపై ప్రజల నుంచి 412 అర్జీలు అందినట్లు కమిషనర్ నాగరాజు తెలిపారు. వీటిని క్రోడీకరించి రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు లేని వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అనిల్‌కుమార్, శ్రీదేవి, పెంటయ్య, శ్రీనాథ్ పాల్గొన్నారు.