
నాలాలు మాయం
నారాయణపేట: జిల్లా కేంద్రంలో నాలాలను, వాటిని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలను కొందరు ఆక్రమించి యథేచ్ఛగా భారీ భవంతులు నిర్మించారు. డ్రెయినేజీలపైనా నిర్మాణాలు చేపట్టారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే నీరు ముందుకు పారేందుకు అవకాశం లేక.. లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందని.. తమకు ఎప్పటికై నా ముప్పు పొంచి ఉందని లోతట్టు కాలనీల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలా కబ్జాకు గురైందన్న సమాచారం తెలిసినా.. అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
కచ్చా నాలాలు ఇరిగేషన్‌వి..
పేట పురపాలికలో ఉన్న ప్రధాన నాలాలు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నాయి. కొండారెడ్డిపల్లి చెరువు దగ్గర నుంచి వచ్చే వరద నీరు పళ్ల ఏరియా, యాద్గీర్‌రోడ్, ప్రతిభ కళాశాల వెనకభాగం నుంచి ఒల్లంపల్లి రోడ్‌లోని బ్రిడ్జి దగ్గర వరకు ఉన్న నాలా ఒకటి. అమ్మణ్ణబాయి నుంచి లింగయ్యగుడి, గాంధీనగర్, సాయివిజయ్‌కాలనీ, ఎస్పీ ఆఫీస్‌పక్కన, ఆర్టీసీడిపో పక్క నుంచి ఇంటిగ్రేటేడ్ మార్కెట్ పక్కన, అశోక్‌నగర్, సత్యనారాయణ స్వామి ఆలయం సమీపం నుంచి ఒల్లంపల్లి బ్రిడ్జి దగ్గర మరో నాలా కలుస్తుంది. ఈ రెండు నాలాలు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నవంటూ అధికారులు చెబుతున్నారు. కాగా అమ్మణ్ణబాయి నుంచి వచ్చే నాలా అక్కడక్కడ సీసీ డ్రెయిన్ నిర్మాణం చేపట్టడంతో మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిందని.. కొండరెడ్డిపల్లి చెరువు దగ్గర నుంచి వచ్చిన నాలా మాత్రం ఇరిగేషన్ పరిధిలో ఉంది.
జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా కబ్జాలు.. అడ్డగోలు నిర్మాణాలు
డ్రెయినేజీలపైనా కట్టడాలు
భారీ వర్షాలు కురిస్తే
ముందుకు పారని నీరు
లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు
భయాందోళనలో ప్రజలు

నాలాలు మాయం

నాలాలు మాయం