సర్వేయర్లు కావాలె.. | - | Sakshi
Sakshi News home page

సర్వేయర్లు కావాలె..

Jun 30 2025 3:52 AM | Updated on Jun 30 2025 3:52 AM

సర్వే

సర్వేయర్లు కావాలె..

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్‌– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్‌ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్‌ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్‌ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్‌లైన్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లా పోస్టులు ఉన్నవారు ఖాళీలు

మహబూబ్‌నగర్‌ 27 18 9

నారాయణపేట 8 3 5

జో.గద్వాల 20 9 11

నాగర్‌కర్నూల్‌ 28 13 15

వనపర్తి 26 13 13

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత

రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు

పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న సర్వే ల్యాండ్‌ అధికారులు

2 వేలకుపైగానే ఎఫ్‌లైన్‌ అర్జీల పెండింగ్‌

తప్పనిసరి పరిస్థితుల్లో

ప్రైవేట్‌ వ్యక్తులను

ఆశ్రయిస్తున్న రైతులు

సర్వేయర్లు కావాలె.. 1
1/1

సర్వేయర్లు కావాలె..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement