
జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలివ్వాలి
నారాయణపేట: జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ గురువారం తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ అనుబంధం) ఆధ్వర్యంలో డీఎల్‌పీఓ సుధాకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బి.నర్సింహా, జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షకార్యదర్శిలు ఎదిరింటి నర్సింమ, బోయిన్ పల్లి రాములు మాట్లాడుతూ కార్మికులకు చాలీచాలని వేతనాలు నెలకు రూ.9,500 ఇస్తున్నా ఆవి సైతం రెగ్గులర్‌గా ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నరన్నారు. ప్రభుత్వం వారితో పని చేపించుకొని వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. జీవో ఆరవై ప్రకారం జీతాలు పెంచాలని, పీఎఫ్ ఈఎస్‌ఐ గ్రాట్యూట్ చట్టాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 51 రద్దు చేయాలని, అందరిని పర్మిట్ చేయాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాద మరణానికి 10 లక్షలు ఇవ్వాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు నరేష్, రాంచందర్, హన్మంతు, తాయప్ప, మహాదేవ్, తదితరులు పాల్గొన్నారు.