
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
నారాయణపేట రూరల్/ దామరగిద్ద: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానినికి తోడ్పాటు అందిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట మండలంలోని జాజాపూర్లొ నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం ఆదివారం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ప్రాంతం నుంచి క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం సదాశివరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు కోట్ల రవీందర్ రెడ్డి, యువకులు పాల్గొన్నారు.
కనకరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు
మండలంలోని దామరగిద్ద, అన్నసాగర్ గ్రామాల్లో జరిగిన కనకరాయ, పోతురాజు జాతరలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్‌చార్జ్ కుంభం శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామాల్లో జరిగే జాతర ఉత్సవాలు భక్తుల్లో ఐక్యతను చాటుకుంటాయన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటి సభ్యులు, మార్కెట్ కమిటి చైర్మన్ శివారెడ్డి. విండో అద్యక్షుడు ఈదప్ప, బాల్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకట్రామరెడ్డి, రఘు, మాణిక్యప్ప, నర్సింహా, ఖాజా, వెంకటప్ప, తదితరులు పాల్గొన్నారు.