
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని...
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా 5 కళాశాలలను ప్రారంభించారు. 2024లో మరో ఐదు కాలేజీలను ప్రారంభించాల్సి ఉండగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాలేజీలపై కక్ష కట్టింది. నిధులు కూడా మంజూరు చేయడం లేదు. తెలంగాణలో ప్రభుత్వం మారినా విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది. ఏపీలో అందుకు విరుద్ధంగా సీఎం చంద్రబాబు ఆలోచనధోరణి ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే దుర్దేశంతో వైద్య విద్యను పూర్తిగా పక్కన పెట్టారు.
– డాక్టర్ శశికళ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ, నంద్యాల
వైద్య విద్యను
ప్రైవేటు పరం చేసే కుట్ర
కూటమి ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తోంది. 2024లో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తయినా ప్రారంభించ లేదు. దీంతో విద్యార్థులు 750 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరంలో మిగిలిన కాలేజీలను కూడా పక్కన పడేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్క కళాశాలను నిర్మించలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఉన్నతంగా ఆలోచించి 17 కళాశాలల నిర్మాణం చేపడితే వాటిని కూడా అడ్డుకోవడం హేయం.
– ఎంఆర్ నాయక్,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని...