ప్యాపిలి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మెట్టు వెంకటేశ్వర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. వైఎస్సార్‌సీపీ హయాంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడిగా పని చేసిన వెంకటేశ్వర్ రెడ్డికి రైతు సమస్యలపై మంచి అవగాహన ఉంది. దీన్ని గుర్తించిన అధిష్టానం రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పై మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు.
బాల్య మిత్రునికి ఆర్థిక సాయం
మద్దికెర: బాల్య మిత్రుడు కుంకునూరు వెంకటేష్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో మద్దికెరకు వెళ్లి 2003–04 బ్యాచ్ విద్యార్థులు గురువారం రూ.42,650 ఆర్థికసాయం అందజేశారు. అలాగే విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి రూ.10 వేలు ఆర్థిక సాయం ఇచ్చారు. మిత్రుడు ఆపదలో ఉంటే ఆదుకోవడం మానవత్వం అని రాజు, కృష్ణారెడ్డి, నల్లగుట్ల తెలిపారు.
6న బ్రాహ్మణ విద్యార్థులకు సన్మానం
కర్నూలు(అర్బన్): పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులను జూలై 6వ తేదీన సన్మానించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు. కర్నూలులోని కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరంతో పాటు కల్లూరు మండలంలోని బ్రాహ్మణ విద్యార్థులను సన్మానిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థులు తమ మార్కుల జాబితాల జిరాక్స్ కాపీలను జతచేసి జూలై 3వ తేదిలోగా స్థానిక సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మేనేజర్‌కు అందించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9393605937, 9440224878 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఆదోని ఎమ్మెల్యేకు చుక్కెదురు
ఆదోని సెంట్రల్: ఆదోని రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న పనులను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి చుక్కెదురైయింది. పనులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఏడీఈని కోరగా డీఅర్‌ఎం అనుమతులు కావాలని చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా అవాక్కయ్యాడు. రూ. 9 కోట్లతో పనులు జరుగుతున్నప్పుడు కనీసం ప్రణాళిక నమూనాలు కూడా లేవా అంటూ ప్రశ్నించారు. అధికారులు స్పందించి నమూనాలు అయితే ఉన్నాయని చూపించారు. ఒకసారి లేవు అంటారు మరి చూపిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లలో నాణ్యతతో పనులు చేపట్టాలని అధికారులు సూచించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా వెంకటేశ
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా వెంకటేశ
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా వెంకటేశ