గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు... | - | Sakshi
Sakshi News home page

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు...

Jul 5 2025 6:12 AM | Updated on Jul 5 2025 6:12 AM

గత వై

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు...

మంచానికే పరిమితమైన కుమార్తె స్వరూపకు నీళ్లుతాపుతున్న సారమ్మది దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామం. పుట్టుకతోనే మస్థిస్కా వ్యాఽధితో బాధపడుతున్న స్వరూపను వారానికికో పది రోజులకో ఒక సారి 40 కిలో మీటర్ల దూరం ఉన్న నంద్యాల ఆసుపత్రికి తీసుకు వెళ్లాలి. ప్రత్యేకంగా ఆటో బాడుగకు తీసుకోవాల్సి ఉండటంతో పేద కుటుంబమైన వీరికి ఆర్థిక భారంగా మారేది. అయితే గత వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఇంటి దగ్గరకే వచ్చి ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇచ్చేవారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇంటి దగ్గరకు కాదు కదా గ్రామానికి కూడా డాక్టర్‌ రాకపోవడంతో వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘ప్రతి నెలా రూ. 5వేల నుంచి రూ. 10 వేలు వరకు ఖర్చు వస్తోంది.. ఎలా బతకాలి’ అంటూ వృద్ధురాలు సారమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.

నాడు చిన్నారి స్వరూపకు ఇంటి వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్‌ (ఫైల్‌)

ఫ్యామిలీ డాక్టర్‌ సేవలను నీరుగార్చిన రాష్ట్ర ప్రభుత్వం

కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ

గ్రామాల్లో నిలిచిపోయిన

వైద్య శిబిరాలు

కార్పొరేట్‌ వైద్యసేవలకు

దూరమైన గ్రామాలు

ఇబ్బందులు పడుతున్న రోగులు

● ఆరోగ్య శిబిరాల్లో క్యాన్సర్‌, గుండె, కిడ్నీ, లివర్‌, మొదడు సంబంధిత ప్రాణాంతక వ్యాధులు సోకిన రోగులు లక్షలాది మందికి వైద్యసేవలు అందించారు. ప్రజలకు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసమైన 120 రకాల మందులు ఉచితంగా అందజేశారు.

● ఫిజీషియన్‌ ఇంటికే వచ్చి పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడంతో పాటు తగు సూచనలు, సలహాలు ఇస్తుండటంతో రోగులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసేవారు.

● జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని 104 వాహనాలతో నిర్వహించారు.

● జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 2023 సెప్టెంబర్‌ 30 నుంచి నవంబర్‌ 16 వరకు 478 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో 2.95 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. 2.70 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు 10,542 మందిని రెఫర్‌ చేశారు. 20,541 మందికి కేటరాక్ట్‌ శస్త్ర చికిత్సలు చేశారు. సుమారు 30 వేల మందికి కళ్లద్దాలు అందజేశారు.

● 2024 జనవరి నుంచి మే వరకు రెండో విడతలో 368 వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో సుమారు 2.60 లక్షల మందికి వైద్య సేవలు అందించారు. 1,79,456 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 2,341 మందిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రెఫర్‌ చేశారు. 193 కేటారాక్ట్‌ శస్త్రచికిత్సలు చేసి, 9,547 మందికి కళ్లద్దాలు అందించారు.

ఆళ్లగడ్డ: సంపన్నులకే పరిమితమైన ‘ఫ్యామిలీ డాక్టర్‌’ సేవలు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మారుమూల పల్లెలకు వచ్చాయి. నిరుపేదలు సైతం ఇంటి వద్దే ఉచితంగా స్పెషలిస్ట్‌ డాక్టర్లతో వైద్య సేవలు అందుకున్నారు. నడవలేని వృద్ధులు, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలు సైతం ఇంటి దగ్గరకే ఉచితంగా మందులు పొందారు. అనేక రకాల వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడంతో త్వరగా నయమయ్యేవి. రూపాయి ఖర్చు లేకుండా, దూర ప్రాంతాల్లోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే మెరుగైన వైద్య సేవలు అందేవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ పథకాలపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మళ్లీ పట్టణాల్లోని కార్పొరేట్‌ ఆసుపత్రులకు పరుగు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది.

భరోసా ఏదీ?

సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబంలోఏ ఒక్కరికి జబ్బు చేసినా ఒకే వైద్యుడి వద్దకు ఆనవాయితీ. క్రమం తప్పకుండా ఒకే డాక్టర్‌ వద్దకు వెళ్తుండటంతో పేషెంట్‌పై ఆ డాక్టర్‌కు ఆవగాహన ఏర్పడుతుంది. రోగుల సమస్యలు తక్షణమే తెలుసుకుని త్వరితగతిన చికిత్స అందించే వీలుంటుంది. ఇలాంటి విధనంలానే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘‘ ప్యామిలీ ఫిజీషియన్‌’’ విధానాన్ని అమల్లోకి తీసుకు రావడంతో బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమైన రోగులకు ఎంతో లబ్ధి చేకూరింది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాలు లేదు. దీంతో దీర్ఘకాలిక రోగులకు భరోసా దక్కడం లేదు. మంచానికే పరమితమైన వారు వైద్యం అందక దీనంగా చూస్తున్నారు.

పనిచేయని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విలేజ్‌ హె ల్త్‌ క్లినిక్స్‌ పట్ల చిన్నచూపు చూస్తోంది. అక్కడ పనిచేసే ఎంఎల్‌హెచ్‌పీ/సీహెచ్‌ఓలకు జీతభత్యాలు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఎంఎల్‌హెచ్‌పీల సమ్మె కారణంగా గ్రామాల్లోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు మూతపడ్డాయి. దీంతో రోగం వచ్చిన ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సాధారణంగా పీహెచ్‌సీల్లోని ఇద్దరు వైద్యాధికారుల్లో ఒకరు ప్రతి నెలా రెండుసార్లు 104 వాహనంలో వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు వెళ్లి రోగులను పరీక్షించాలి. నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

ఆరోగ్య సురక్షపై కక్ష

‘ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఫలితంగా పేదలకు స్పెషలిస్ట్‌ డాక్టర్‌ల సేవలు అందడం లేదు. ప్రతి రోజు ఆయా మండలంలోని ఒక సచివాలయంలో ఇద్దరు స్షెషలిస్ట్‌ వైద్యులతో పాటు ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందితో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాన్ని ఏర్పాటు చేసేవారు. వివిధ రకాల వ్యాధులతో శిబిరానికి వచ్చే వారికి వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు అందజేసేవారు. అంతేకాకుండా శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేసి అక్కడ శస్త్రచికిత్సలు చేయించేవారు. అదే విధంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి కంటి ఆపరేషన్లు చేయించడం, కళ్లద్దాలు కూడా అందజేసేవారు. ఆసుపత్రులకు వెల్లాల్సిన పనిలేకుండానే లక్షలాది మందికి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాల ద్వార సేవలు అందాయి. కూటమి ప్రభుత్వంలో ఈ సేవలు అందడం లేదు. ప్రజలు వ్యయప్రయాసలతో ప్రాణాలను చేతులో పెట్టుకుని దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

మళ్లీ ప్రైవేటు వైద్యమే

అనారోగ్యంతో మంచంలో ఉన్న తల్లి రాళ్ల నన్నెబుకు సేవలు చేస్తున్న కుమారుడి పేరు యూసుఫ్‌. చాగలమర్రి బుగ్గరస్తాకు చెందిన నన్నెబూకు మూడేళ్ల క్రితం పక్షవాతం సోకింది. దీంతో అప్పటి నుంచి కేవలం మంచానికే పరిమితమైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నెలకు ఒకటి రెండుసార్లు ఇంటి దగ్గరకే స్పెషలిస్ట్‌ డాక్టర్‌ వచ్చి వైద్యం చేసేవారు. మధ్యలో అవసరమైతే ఫోన్‌ చేస్తే వైద్య సిబ్బంది వచ్చి సేవలు అందించేవారు. ప్రభుత్వం మారడంతో ఏడాదిగా వైద్యులు, సిబ్బంది ఎవరూ రావడం లేదు. దీంతో నెలనెలా ప్రొద్దుటూరు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని యూసుఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు... 
1
1/4

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు... 
2
2/4

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు... 
3
3/4

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు... 
4
4/4

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement