
అశ్వంపై అలీ అక్బర్ పీరు ఊరేగింపు
చాగలమర్రి: మొహర్రం వేడుకల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం రాత్రి చిన్నమకానం వీధిలో కొలువైన అలీ అక్బర్ పీరును అశ్వంపై ఊరేగించారు. ఈ పీరును వివాహం కాని యువకులు ఊరేగించడం సంప్రదాయం కావడంతో యువత భారీగా తరలివచ్చింది. సంప్రదాయ మేళతాళాలతో చిన్నమకానంలో ప్రారంభమైన ఊరేగింపు లాల్ స్వామి మకానం మీదుగా పెద్దమకానం, మొయిన్ బజారు, పాతబస్టాండులోని నిర్వాహకుల ఇళ్ల వరకు కొనసాగి తిరిగి చిన్నమకానంలోని పీర్ల చావిడి వద్దకు చేరుకుంది. ఊరేగింపులో అడుగడుగునా భక్తులు పీరుకు మొక్కులు చెల్లించారు. దారివెంట స్వామి వారికి ప్రత్యేక ఫాతేహలు నిర్వహించారు.

అశ్వంపై అలీ అక్బర్ పీరు ఊరేగింపు