
అవ్వకు ‘వంద’నం
ప్రస్తుత కాలంలో 75 సంవత్సరాలు జీవించడమే కష్టం. అయితే మద్దికెర మండలం బురుజుల గ్రామానికి చెందిన అవ్వ హనుమంతమ్మ అనారోగ్య సమస్యలు లేకుండా వందేళ్లకు పైగా జీవనం సాగిస్తోంది. దీంతో కుటుంబసభ్యులు గురువారం అవ్వను సన్మానించారు. హనుమంతమ్మకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మొత్తం 89 మంది మనువళ్లు, మనవరాళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమంతమ్మ చిన్న తనంలో 1926లో పెరవలి గ్రామానికి మహాత్మాగాంధీ వచ్చినప్పుడు ఇంట్లో పెద్ద వాళ్లతో కలిసి వెళ్లి చూశారని, ఈ విషయాన్ని తమకు చెప్పే వారని చిన్న కుమారుడు రామాంజనేయులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహారం తినాలో, ఎలాంటి పనులు చేయాలో తన తల్లికి బాగా తెలుసని చెప్పారు. – మద్దికెర

అవ్వకు ‘వంద’నం