
అప్పుడు మినరల్.. ఇప్పుడు జనరల్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు–నేడు పేరుతో పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించింది. నీటి సమస్య తలెత్తకుండా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. హెచ్‌ఎంల నిర్లక్ష్య కారణంగా కొన్ని పాఠశాలల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా వాటర్ ప్లాంట్ల ఏర్పాటుపై ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా విద్యార్థులకు రక్షిత మంచి నీరు అందక కుళాయి నీరే తాగాల్సి వస్తోంది. కే.కొత్తూరు, చిన్నయ్యస్వామి చెంచుగూడెంలలో మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో ఆయా పాఠశాలల విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి కుళాయి నీరు తెచుకుని దాహం తీర్చుకున్నారు. చిన్నయ్య స్వామి చెంచుగూడెంలో నిర్వాహకులు ఓ బిందెలో నీరు ఉంచి రెండు గ్లాసులను ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం వాటర్ ప్లాంట్ల ద్వారా రక్షిత మంచి నీటిని సరఫరా చేసి విద్యార్థుల దాహం తీర్చాలని గ్రామస్తులు కోరారు. – రుద్రవరం
● విద్యార్థులకు అందని రక్షిత మంచి నీరు

అప్పుడు మినరల్.. ఇప్పుడు జనరల్