
సర్దుబాటుతో చతికిల‘బడి’
● ఒకే పాఠశాలలో మాయమైన
10 ఉపాధ్యాయ పోస్టులు
పత్తికొండ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన సర్దుబాటు ప్రక్రియ పత్తికొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను దెబ్బతీసింది. పాఠశాలకు 40 ఉపాధ్యాయ పోస్టులు మంజూరవగా ఇక్కడ 31మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కుదించారు. దీంతో 10 పోస్టుల వరకు ఇతర ప్రాంతాలకు కేటాయించారు. ఇప్పుడు 21మంది ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ ఉండనున్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది. మొత్తం 1,300 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. తరగతుల వారీగా సెక్షన్లు విభజించి బోధన కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడటంతో తల్లిదండ్రులు వలసబాట పట్టి పిల్లలను కూడా తీసునకెళ్లారు. దీంతో విద్యార్థుల సంఖ్య 800కు తగ్గింది. దీంతో పాఠశాలలో 10 ఉపాధ్యా పోస్టులు మాయమయ్యాయి.