
మోసం చేసి పర్యటనా?
● ఏపీ మహిళా సమాఖ్య జిల్లా
అధ్యక్షురాలు బి.గిడ్డమ్మ
కర్నూలు(సెంట్రల్): ఎన్నికల సమయంలో మహిళలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ విమర్శించారు. మోసం చేసిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం సీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద ఎంత మందిపిల్లలు ఉంటే అందరికీ రూ.15,000 ఇస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారనప్నారు. సంపద సృష్టించి మహిళలను లక్షాధికారులను చేస్తానని చెప్పి బిచ్చగాళ్లను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి భారతి, పావని పాల్గొన్నారు.