కర్నూలు(అగ్రికల్చర్): లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోయినప్పటికీ పెన్షన్‌దారులకు మార్చి నెల పింఛన్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రాష్ట్ర ఖజానా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2023 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి చివరిలోగా లైఫ్ సర్టిపికెట్లు ఇవ్వాల్సి ఉంది. తర్వాత ఈ గడువును మార్చి నెల చివరి వరకు పొడిగించింది. అయితే ఇప్పటికీ కొంతమంది లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వలేకపోయారు. అయితే మార్చి నెల పెన్షన్ అందరికీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా ట్రెజరీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఖజానా శాఖ డైరెక్టర్ మోహన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లను ఏప్రిల్ 15లోగా సంబంధిత ట్రెజరీ అధికారులకు జీవన్‌ప్రమాణ్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. బెడ్‌పై ఉండి కదలలేని వారు మాన్యువల్‌గా ఇవ్వవచ్చు. సంబంధిత ట్రెజరీ అధికారులు వీడియో కాల్ ద్వారా ధ్రువీకరించుకుంటారని అధికారులు తెలిపారు.
ఖజానా శాఖ డైరెక్టర్ ఆదేశాలు
లైఫ్ సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు
ఏప్రిల్ 15 వరకు అవకాశం