
కమనీయం.. పాండురంగడి చక్రస్నానం
కోవెలకుంట్ల: పట్టణంలోని రంగరాజుపేటలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో శనివారం వసంతోత్సవం, స్వామివారి చక్రసాన్న కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు పాండురంగడికి పంచామృతాభి షేకం, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం స్వామివారి వసంతోత్సవాన్ని నిర్వహించి భక్తులు రంగులు చల్లుకున్నారు. వేసవికాలంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుని 11 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో కల్యాణం, వాహన సేవలు, రథోత్సవ కార్యక్రమాల్లో స్వామివారి వేడిని చల్లార్చేందుకు, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోనేటిలో చేపట్టిన చక్రస్నాన కార్యక్రమం కమనీయంగా కొనసాగింది. రాత్రి ధ్వజారోహణ, కంకణ నిమజ్జనం, నాకబలితో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన పాండురంగడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరిరోజు నిర్వహించిన కార్యక్రమాలను తిలకించేందుకు పట్టణంతోపాటు చుక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కోనేటి ప్రాంగణం జనసంద్రమైంది.