
కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్ట్‌లు
బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్ట్ చేయించారని మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ఆరోపించారు. శిల్పా నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ప్రజలకు చెప్పుకోదగిన మేలు ఏమి చేయలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేశారన్నారు. సూపర్‌సిక్స్ పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు నమోదు చేయటం దౌర్భాగ్యమన్నారు. సూపర్‌సిక్స్ పథకాల అమలుపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని ఏదో ఒక సమస్యలు చూపించి మభ్యపెడుతున్నారని వివరించారు. అసలు స్కామ్‌లే లేనిచోట లిక్కర్‌స్కామ్‌ల పేరుతో డ్రామా మొదలు పెట్టి కక్ష సాధింపు కోసం ఇద్దరు రిటైర్డ్ అధికారులను అరెస్ట్ చేసి దాన్ని భూతద్దంలో ప్రజలకు చూపించటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుతో పాటు స్కిల్ స్కామ్‌లో నిందితులను కేంద్రప్రభుత్వమే గతంలో అరెస్ట్‌లు చేపట్టిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బెల్టు షాపులు లేకుండా చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం ఆదాయం కోసం పల్లెల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగిస్తుందని విమర్శించారు.
ఆధారాలు లేకపోయినా వేధింపులు
అధికారులపై కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ రంగుపులిమి కేసుల నమోదుతో పాటు సరైన పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయటం మంచిదికాదన్నారు. సోషల్‌మీడియాలో ఆక్టివ్‌గా ఉన్నవారిపై ఒక్కొ వ్యక్తిపై 17 కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేయటం దారుణమన్నారు. సమావేశంలో జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షుడు దాల్‌మిల్ అమీర్, మాజీ బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్లు బషీద్, మజీద్‌లు పాల్గొన్నారు.
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి
అరెస్ట్ అన్యాయం
మాజీ ఎమ్యెల్యే శిల్పారవి,
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా