నంద్యాల(సిటీ): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయని ఆర్‌ఐఓ గురువయ్యశెట్టి తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 123 కేంద్రాల్లో చివరి రోజు ఫిజిక్స్ పేపర్–2, ఎకనామిక్స్ పేపర్–2, కామర్స్ పేపర్–2, సోషియాలజీ పేపర్–2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–2 పరీక్షలు జరిగాయన్నారు. 32,979 మంది విద్యార్థులకు గానూ 31,798 మంది హాజరు కాగా 1,181 మంది గైర్హాజరయ్యారన్నారు. నంది కొట్కూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 8 మంది విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు గుర్తించి డిబాజ్ చేసినట్లు తెలిపారు. కాగా ఆర్‌ఐఓ గురువయ్యశెట్టి 5 పరీక్షా కేంద్రాలను పరిశీలించగా డీవీఈఓలు 7 కేంద్రాలను, హెచ్‌పీసీలు 6 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 29 కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్‌లు 12 కేంద్రాలను కస్టోడియన్స్ 29 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.
చివరి రోజు 8 మంది విద్యార్థుల డిబార్