
జూమ్ మీటింగ్‌లో మాట్లాడుతున్న ఎస్పీ
బొమ్మలసత్రం: నంద్యాలను రాష్ట్రంలోనే నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ కె రఘువీర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని సబ్‌డివిజన్‌ల పోలీస్ అధికారులతో నేరసమీక్ష సమావేశాన్ని జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ పలు సూచనలు, సలహాలు అందించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తులు వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. హత్యలు, హత్యాయత్నాలు, గర్ల్స్ మిస్సింగ్ కేసుల్లో పురోగతిపై చర్చించారు. చార్జ్‌షీట్లు, సమన్లు, నాన్‌బెయిలబుల్ వారెంట్లపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోన్‌యాప్‌లపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో సీఐలు జయరాములు, దస్తగిరిబాబు, ఎస్‌ఐలు సూర్యమౌళి, అశోక్, రమేష్, హరినాఽథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలి
దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు. బీరువా తాళాలు బీరువాపైన కానీ, పక్కన కానీ ఉంచరాదన్నారు. ఎక్కడికై నా వెళ్లే సమయంలో ఇంట్లో లైట్లు వేసి ఉంచి వెళ్లాలని, అలాగే సమీప పోలీస్టేషన్‌లో సమాచారం అందించి వెళ్లాలని సూచించారు.