
నేడు సిమెంట్ రోడ్డు నిర్మాణం
రోడ్ల నిర్మాణం కోసం
ఖర్చు చేసిన 14వ ఆర్థిక సంఘం
నిధుల వివరాలు(రూ.లక్షల్లో..)
మునిసిపాలిటీ 14వ ఆర్థిక ఇప్పటి వరకు
సంఘం ఖర్చు
నిధులు అయినవి
నందికొట్కూరు 1192.32 915.97
ఆత్మకూరు 1409.43 993.54
ఆళ్లగడ్డ 1512.16 1510.16
ఎమ్మిగనూరు 2160.91 974.78
గూడూరు 880.28 697.28
నందికొట్కూరు: పట్టణాల్లో రహదారుల అభివృద్ధికి పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న మట్టి రోడ్లను బాగుపరుస్తూ ప్రజల కష్టాలు తీరుస్తున్నాయి. ఇందుకోసం ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌గా, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, ఆళ్లగడ్డ మునిసిపాలిటీలుగా, గూడూరు, బేతంచెర్ల నగర పంచాయితీలుగా ఉన్నాయి. కర్నూలు నగరంలో 6.5 లక్షలు, నంద్యాలలో 3.5 లక్షలు, ఆదోనిలో 2.5 లక్షలు, ఎమ్మిగూరులో 1.5 లక్షలు, ఆత్మకూరులో లక్షకు పైగా, నందికొట్కూరులో లక్ష, డోన్‌లో 90 వేల జనాభా నివాసం ఉంటున్నారు. రోజురోజుకూ పట్టణాల్లో జనాభా పెరుగుతుండగా, కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో పాలకవర్గాలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని మునిసిపాలిటీలను అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. దీంతో అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నారు. నందికొట్కూరు మునిసిపల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు పట్టణాభివృద్ధిపై సమీక్ష చేస్తూ, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ పట్టణాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
నిధుల ఖర్చు ఇలా..
కర్నూలు నగరంతోపాటు నంద్యాల, ఆదోని, డోన్‌లు అమృత్ స్కీమ్‌లోకి వెళ్లాయి. ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, గూడూరు పట్టణాల్లో రూ.880.28 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో రూ.697.28 కోట్ల రోడ్ల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో రూ.183 కోట్ల పనులు సాగుతున్నాయి. నందికొట్కూరు మున్సిపాలిటీకి 14వ ఆర్థిక నిధులు సుమారు రూ. 11 కోట్లు మంజూరు కాగా రూ.9 కోట్లతో పనులు పూర్తయ్యాయి. పట్టణంలోని ఇందిరానగర్, కుమ్మరి వీధి, సూర్య నగర్, మారుతీ నగర్, విలేకరి కాలనీ, కురవపేట, బైరెడ్డి నగర్, విద్యా నగర్, కాలేజీ రోడ్డు, హాజీనగర్, ఏబీఎం పాలెంలో సీసీ రోడ్లు నిర్మించారు. ఆత్మకూరులో సాయిబాబా నగర్, ఇందిరానగర్, రంగమహల్ ఏరియాలో, పాతబస్టాండ్, తోటగేరి, గరీబ్‌నగర్, వెంగళరెడ్డినగర్‌లో రోడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి.
పురపాలక సంఘాల్లో
బాగుపడిన రహదారులు
14వ ఆర్థిక సంఘం నిధులను
ఖర్చు చేసిన పాలకవర్గాలు
తొలగిన పట్టణ ప్రజల
ప్రయాణ కష్టాలు

నందికొట్కూరులోని బైరెడ్డి నగర్‌లో నాడు