
కానుకల లెక్కింపు నిర్వహిస్తున్న దృశ్యం
మహానంది: మహానందీశ్వరుడికి రూ.23,53,504 ఆదాయం లభించినట్లు ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గత 29 రోజులుగా భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను బుధవారం అభిషేకమండపంలో బుధవారం లెక్కించారు. కామేశ్వరీదేవి, మహానందీశ్వర, కోదండ రామాలయం, తదితర ఆలయాల ద్వారా రూ.22,95,048, అన్నదానం విభాగం ద్వారా రూ. 40,056, గోశాల ద్వారా రూ.18,400 లభించినట్లు ఈఓ చెప్పారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున, వీరభద్రుడు, ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.