
నూతన కమిటీ సభ్యులు
కర్నూలు సిటీ: కర్నూలు–నంద్యాల జిల్లాల వొకేషనల్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం నూతన కమిటీ ఎన్నికై ంది. బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో కార్యవర్గ సమావేశం నిర్వహించి కమిటీ అధ్యక్షుడిగా కె.వేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా బి.సునీల్‌ను ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా ఎస్.దేవదానం, సంయుక్త కార్యదర్శిగా దివాకర్, కోశాధికారిగా ఇ. కిరణ్‌కుమార్, కార్యనిర్వాహక సభ్యులుగా ఎ.పవన్, బి.కిశోర్, ఇ. రమేష్ బాబు, విశ్వనాథ్, ముఖ్య సలహాదారులుగా ఇ.పద్మాకర్, గౌరవ అధ్యక్షుడిగా ఆర్.విరూపాక్షిలను నియమించారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ వొకేషనల్ కాలేజీ యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి కృషి
చేస్తామన్నారు.