
ఎంసీఏ పూర్తి చేసి బెంగళూరులోని కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నాలుగు సంవత్సరాలు పని చేశా. పదోన్నతిపై అసెంచర్ సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మూడు ఏళ్లు ఉన్నా. లక్షలాది రూపాయల జీతం వస్తున్నా ఆత్మ సంతృప్తి దక్కలేదు. మూడేళ్ల క్రితం స్వగ్రామం చేరుకొని స్థానిక పరిస్థితులను అవగతం చేసుకున్నా. కేసీ కింద వరి సాగు చేస్తున్నా. ఆ తర్వాత వ్యవసాయంపై దృష్టి సారించడంతో మనశ్శాంతిగా జీవిస్తున్నా. – ఉమామహేశ్వరుడు,
చాబోలు గ్రామం, నంద్యాల మండలం