
ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో పది సంవత్సరాలు బ్యాంక్ ఆఫ్ అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీలో అనలిస్టుగా ఉన్నా. జీతం నెలకు రూ.లక్ష వరకు వస్తుంది. కరోనా కారణంగా రెండు సంవత్సరాల క్రింతం వర్క్ ఫ్రం హోంతో సొంతూరు చేరుకున్నా. వారాంతాల్లో టైంపాస్‌గా మా నాన్నతో కలిసి పొలం పనుల్లో పాల్పంచుకున్నా. మట్టిపై మమకారం పెరిగింది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని నిశ్చయించుకున్నా. అలా డ్రాగన్ ఫ్రూట్ సాగుతో పాటు తైవాన్ జామ, జామ తోటలు సాగు చేస్తుండటంతో ఆదాయం బాగానే ఉంటోంది.
– రవికాంత్, శాంతినగరం గ్రామం, ఆళ్లగడ్డ మండలం