
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే
వెలుగోడు: పుట్టుకతోనే తలసీమియా వ్యాధిబారిన పడి చిన్నారిని ప్రభుత్వం ఆదుకుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందజేసింది. బోయరేవుల గ్రామానికి అంజినాయక్ కుమారుడు తలసీమియా వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాల ఆససుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడి చికిత్సకు రూ.17 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక నాయకుడు ముంతల విజయభాస్కర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి ఈ విషయాన్ని వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఒక్క రోజులోనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.17 లక్షలు మంజూరయ్యాయి. అందుకు సంబంధించిన చెక్కును సోమవారం బాలుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. అలాగే సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను, కర్షక జ్యోతి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.