ప్రసూతి వార్డులో పురుషులు ఉండొద్దు
నల్లగొండ టౌన్ : ‘ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటి.. వారందరినీ బయటికి పంపండి’ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంగళవారం నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఆమె తనిఖి చేశారు. చిన్నపిల్లల వార్డు, ఐసీయూను పరిశీలించారు. పురుషులను ప్రసూతి వార్డులోకి అనుమతించొద్దని ఆదేశించారు. వార్డుల్లో, ఆరు బయట వాహనాలు నిలిపే చోట ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని, ప్రధాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలు 24 గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలింతలకు సహాయకులు ఎక్కువమంది ఉండడం వల్ల చిన్న పిల్లలకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని.. అందువల్ల ఎక్కువ మంది ఉండకుండా, కేవలం ఒక్కరు మాత్రమే ఉండేలా చూసుకోవాని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ అరుణకుమారి, డాక్టర్లు వందన, నగేష్ ఉన్నారు.
లేఅవుట్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
నల్లగొండ : లేఅవుట్ ప్రక్రియ పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తన చాంబర్‌లో ఇరిగేషన్, మున్సిపల్, ఆర్‌అండ్‌బి, తహసీల్దార్లతో ఆమె సమావేశమై మాట్లాడారు. లేఅవుట్ల భూసేకరణ అనుమతులను జాగ్రత్తగా పరిశీలించాలని, అనధికార లేఅవుట్లను అనుమతించవద్దని పేర్కొన్నారు. భూ రికార్డులు, డ్రెయినేజీ, రోడ్డు వెడల్పు, నీటిపారుదల మార్గాలు శాసీ్త్రయ పద్ధతిలో ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా ఇరిగేషన్ అధికారి నాగార్జున, ఆర్‌అండ్‌బి ఈఈ శ్రీధర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, డీటీసీపీఓ కృష్ణవేణి పాల్గొన్నారు.
అప్పీళ్ల పరిశీలన
నల్లగొండ : నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన నామినేషన్లపై వచ్చిన అప్పీళ్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో పరిశీలించారు. నల్లగొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన నామినేషన్లపై 19 అప్పీళ్లు రాగా, వాటి వివరాలను తెలుసుకున్నారు. వాటిలో అప్పీళ్లు 15 తిరస్కరణకు గురికాగా, 4 అప్పిళ్లు అంగీకరించినట్లు ఆర్డీఓ అశోక్‌రెడ్డి కలెక్టర్‌కు తెలిపారు. చండూరు డివిజన్‌కు సంబంధించి నామినేషన్లపై 3 అప్పీళ్లు రాగా, రెండు తిరస్కరణ అయ్యాయని, ఒకటి అంగీకరించామని చందూరు ఆర్డీఓ శ్రీదేవి తెలిపారు. సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.
వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


