కష్టపడి పనిచేసే వారికే పదవులు
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీలో క్రమ శిక్షణ కలిగిన వారికి, కష్టపడి పని చేసే వారికి కచ్చితంగా పదవులు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన పున్నా కై లాష్ నేతకు మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. జిల్లాలో పార్టీ విస్తరణపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని సూచించారు. దీనిపై డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. దేశంలో వోట్ చోరీపై నియోజవకార్గనికి 25 వేల చొప్పున సంతకాల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో లక్షన్నర సంతకాలు చేపట్టాలని, ఆ కార్యక్రమాన్ని ఈనెల 9వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పున్నా కై లాష్‌నేతను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ నల్లగొండ హేమాహేమీ నాయకులు ఉన్న జిల్లా అని, అందరితో కలిసి, జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కై లాష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి డీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఫ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సూచన
ఫ డీసీసీ అధ్యక్షుడిగా నియామకపత్రం అందుకున్న పున్న కై లాష్ నేత
కష్టపడి పనిచేసే వారికే పదవులు


