
అమృత్.. ఆలస్యం!
కల సాకారమయ్యేనా..?
ఉమ్మడి జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలగానే మిగిలిపోతోంది.
చోరీలకు పాల్పడుతున్న..
చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను ఆదివారం నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
- 8లో
పైప్‌లైన్‌కు రోడ్డు పనులు ఆటంకం
చండూరు : అమృత్ 2.0 కింద చండూరు మున్సిపాలిటీకి రూ.9.80 కోట్లు మంజూరయ్యాయి. వాటితో 5 లక్షల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. చండూరులోని జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో, అంగడిపేట రోడ్డులో గల వెంచర్‌లో చేపట్టిన ట్యాంకుల పనులు పిల్లర్ దశలో ఉన్నాయి. దాదాపు 12 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నారు. ఇప్పటికే 11 కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేశారు. జూలై 2024 న ప్రారంభించిన పనులు అగ్రిమెంట్ ప్రకారం మార్చి 2026లో పూర్తి చేయల్సి ఉన్నా 2025 నవంబర్ కల్లా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు. మిగిలిన ఒక్క కిలోమీటర్ పైపులైన్ పూర్తి చేయడానికి ప్రధాన రహదారి విస్తరణ పనులు ఆటంకంగా మారాయి.

అమృత్.. ఆలస్యం!