
మునగ తోట రైతులకు ఉపాధి
నాంపల్లి : ఉపాధి హామీ పథకంలో మునగ తోట సాగుతో రైతులకు ఉపాధి లభిస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయి మాని టరింగ్ సభ్యుడు కెజి.సలీంకుమార్ అన్నారు. ఆదివారం ఆయన నాంపల్లి మండలంలోని రేక్యతండాలో పర్యటించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. అనంతరం పండ్ల తోటల పెంపకం, నర్సరీ, మునగ తోట పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునగతోటతో కుటుంబం మొత్తానికి జీవనోపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీడీ నవీన్‌కుమార్, ఎంపీడీఓ శర్మ, ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, వినోద్‌కుమార్, మంజుల, లింగయ్య, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి
చిట్యాల: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ సభ్యురాలు కొండపల్లి వసుమతి, భారత్ వికాస్ పరిషత్ స్టేట్ సంపర్క్ ప్రెసిడెంట్ సతీష్‌కుమార్ అన్నారు. చిట్యాలలోని ముప్ప కాంప్లెక్స్‌లో జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి చెందుతారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ముప్ప వాసుదేవరెడ్డి, హేమలత, శ్రీలత, మంజుల, శ్రీదేవి, సత్యనారాయణ, అనిత, బొబ్బలి శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రేణుకా ఎల్లమ్మ
ఆలయంలో జడ్జి పూజలు
కనగల్ : దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం జిల్లా ఉమెన్స్ కోర్ట్ జడ్జి కె.కవిత ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.
సివిల్స్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2025 –26 సంవత్సరానికిగాను సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిద్ది శాఖ అధికారి బి.శశికళ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ (బీసీ ఈ, పీడబ్ల్యూడీ) కులాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు www.tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 7లోగా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగే రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతితో 10 నెలలు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040–23546552, 9396621492 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
నారసింహుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులను కొలుస్తూ లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు పొందారు.

మునగ తోట రైతులకు ఉపాధి

మునగ తోట రైతులకు ఉపాధి