
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం
కొండమల్లేపల్లి : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎదుళ్ల ఎల్లయ్య మాదిగ అన్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చింతకుంట్ల గ్రామంలో 400 మంది ఓటర్లు ఉన్న మాదిగలకు కనీసం ఒక్క ఇల్లు రాకపోవడం శోచనీయమన్నారు. మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ అగ్రకుల నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ మేరకు ఎస్సీ కమిషన్‌ను సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షులు వస్కుల శ్రీనివాస్‌మాదిగ, ఎదుళ్ల భిక్షమయ్య, మారపాక రాములు, పంది అంజయ్య, పంది యాదయ్య పాల్గొన్నారు.