
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పెద్దవూర : మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో 2009–10 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా పదహేను ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఒకరికొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అపురూప క్షణాలను సెల్‌ఫోన్‌లో బందించుకున్నారు. అనంతరం నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాటి హెచ్‌ఎం సలికంటి వెంకటయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాసచారి, కర్ణ సైదిరెడ్డి, పాకాల నర్సింహ్మా, కర్ణ రాణి, షర్ఫుద్దీన్, నరేందర్, విద్యార్థులు కేతావత్ రంగానాయక్, హనుమా, వేణు, నరేష్, సత్యనారాయణ, నగేష్, కృష్ణమూర్తి, గణేష్, సీతారామయ్య, లావణ్య, సరిత, అనిత, మౌనిక, స్వాతి, రోజా, రవికుమార్, నరహరి, నాగు పాల్గొన్నారు.