
ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా..?
● క్యూలైన్లలో భక్తుల సమస్యలు
తెలుసుకున్న ఈఓ వెంకట్రావ్
వేసవి సెలవుల్లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శనివారం సుమారు 40వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ వెంకట్రావ్ శనివారం క్యూలైన్లలో, మాఢ వీధుల్లో తిరుగుతూ భక్తుల సమస్యలు తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని భక్తులను అడిగారు. ఎండల తీవ్రతకు, ఉక్కపోతకు భక్తులు ఇబ్బందులుపడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వెంట్రావ్ పేర్కొన్నారు. కొండ కింద శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం వెంటనే ఏసీలు బిగించాలని అధికారులను ఆదేశించారు. వ్రత పూజల్లో పాల్గొనే భక్తులకు సామాగ్రీ, రవ్వ ప్రసాదంతో పాటు అదనంగా శ్రీస్వామి వారి శేష వస్త్రం (శెల్లా, కనుము) అందజేసేందుకు ఏర్పాటు చేయాలని ఆధికారులకు చెప్పారు. ఆయన వెంట డిప్యుటీ ఈఓ దోర్బాల భాస్కర్‌శర్మ ఉన్నారు.