
పోచంపల్లి జరూర్ ఆనా..
● కలెక్టర్ హనుమంతరావు
భూదాన్‌పోచంపల్లి: తెలంగాణతో పాటు పోచంపల్లికి జరూర్ ఆనా అని కలెక్టర్ హనుమంతరావు సుందరీమణులను కోరారు. హంపి థియేటర్ జరిగిన ర్యాంప్‌వాక్ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్ ప్రత్యేకమైన కళ అని, ఇది ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. 2021లో యునెస్కో చేనేత ఉత్తమ హెరిటేజ్ విలేజ్‌గా పోచంపల్లి అంతర్జాతీయ అవార్డు పొందిందని గుర్తు చేశారు. భూదానోద్యమానికి శ్రీకారం చుట్టి లక్షలాది మంది పేదలకు భూదానం చేసిన గొప్ప గ్రామమని కొనియాడారు. భూదాన్‌పోచంపల్లికి సుందరీమణుల సందర్శనతో చేనేతకు మరింత గుర్తింపురావడమే కాకుండా చేనేత కళాకారులకు కూడ మార్కెటింగ్ సదుపాయాలు పెరుగుతాయని అన్నారు. చేనేత కళను సజీవంగా నిలుపుతున్న చేనేత కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు.