
దేశ వ్యాప్త సమ్మెకు బీఆర్‌ఎస్ మద్దతు
నకిరేకల్: కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకిస్తూ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని ఓ ఫంక్షన్ హాల్ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలుచేయడం లేదన్నారు. ఈ సమావేశంలో నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రబాకర్, ఆయా సంఘాల నాయకులు బొజ్జ చినవెంకులు, వంటేపాక వేంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, సింగం రేణుక, ఉయ్యాల సైదులు, గోర్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య