
జేఎల్‌ఎం జీత వ్యత్యాసాన్ని సరిచేసేందుకు చర్చలు
హుజూర్‌నగర్: విద్యుత్ సంస్థలోని 2023 బ్యాచ్ జేఎల్‌ఎం జీత వ్యత్యాసాన్ని సరిచేసేందుకు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(టీఆర్‌వీకేఎస్) రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీజీఎస్‌పీడీసీఎల్ కార్యదర్శి పి. కరెంట్‌రావు తెలిపారు. మంగళవారం హుజూర్‌నగర్ విద్యుత్ డివిజన్ ఆధ్వర్యంలో మే డే పక్షోత్సవాలలో భాగంగా డీఈ కార్యాలయం ముందు యూనియన్ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్‌ల కన్వెర్షన్ కోసం యూనియన్ కృషిచేస్తుందని అన్నారు. త్వరలో జరగబోయే సబ్ ఇంజనీర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా మల్టీపుల్ ఛాయిస్‌లో ఇచ్చే విధంగా యాజమాన్యంతో మాట్లాడతామని చెప్పారు. ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పి. రమేష్‌బాబు, పి. మల్లికార్జున్, బి. విశ్వనాథచారి పాల్గొన్నారు.