
రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి
రామగిరి(నల్లగొండ): రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించే విధానాలను వ్యతిరేకించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ జిల్లా నాయకులు మంగళవారం నలగొండ రైల్వే స్టేషన్ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దేశంలో రైల్వే వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైల్వే రంగంలో భద్రతా చర్యలు పెంచాలని, ప్రమాదాలు అరికట్టాలని ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రైవేటీకరణ వల్ల సరుకు రవాణా చార్జీలు పెరగడంతో వస్తువుల రేట్లు పెరుగుతాయన్నారు. ప్రయాణికుల భద్రత కోసం సరైన చర్యలు చేపట్టాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్యాసింజర్ రైళ్లు పెంచాలని, రైళ్లల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, పల్లె నగేష్, అవుట రవీందర్, నకరెకంటి సత్తయ్య, లింగస్వామి, వెంకన్న, రాధాకష్ణ పాల్గొన్నారు.