
డబుల్‌బెడ్రూం ఇళ్ల పనుల పూర్తిపై నిర్లక్ష్యం సరికాదు
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనుల పూర్తిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేయడం సరికాదన్నారు. డబుల్‌బెడ్రూం ఇళ్ల పనులను వెంటనే పూర్తిచేసి.. పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు పొదిల రామయ్య, అశోక్, వెంకటేశ్, మధు, చంద్రశేఖర్, సత్యనారాయణ, మల్లికార్జున్ ఉన్నారు.