
ఇంటర్ కళాశాలలకు మహర్దశ
కందనూలు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన మెరుగైన విద్య అందించేందుకు గాను ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. జిల్లాలో 14 జూనియర్ కళాశాలలు ఉండగా.. రూ. 1.22కోట్లు మంజూరయ్యాయి. దశాబ్దకాలం తర్వాత జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వసతులు మెరుగు..
పదేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు రాకపోవడంతో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. సరైన వసతులు లేక విద్యార్థులు, అధ్యాపకులు నానా అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. తరగతి గదుల మరమ్మతుకు అవకాశం లభించింది. విద్యార్థులకు టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, భవనాలకు రంగులు వేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు.
సమస్యలు తీరుతాయి..
చాలా సంవత్సరాల తర్వాత జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు కళాశాలలను బాగు చేసుకునే అవకాశం లభించింది. నిధులను సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటరమణ, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి
కళాశాలల వారీగా నిధుల కేటాయింపు ఇలా..
పదేళ్ల తర్వాత నిధులు మంజూరు
జిల్లాలో 14 కాలేజీలకు రూ.1.22 కోట్లు కేటాయింపు

ఇంటర్ కళాశాలలకు మహర్దశ

ఇంటర్ కళాశాలలకు మహర్దశ