
శనేశ్వరాలయానికి భక్తుల తాకిడి
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జేష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు నిర్వహించేందుకు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు.ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు, గోత్రనామార్చనలు చేశారు. అనంతరం శివాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: సబ్‌జైలులో ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సబ్‌జైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్షణికావేశం, ఇతరాత్ర కారణాలతో నేరాలకు పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎవరికై నా న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితి ఉంటే.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

శనేశ్వరాలయానికి భక్తుల తాకిడి