
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కొల్లాపూర్ రూరల్: పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వెటర్నరీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి జ్ఞాన శేఖర్ సూచించారు. శుక్రవారం కొల్లాపూర్, సింగోటం, పెంట్లవెల్లి పశువైద్య కేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పశువులు, జీవాలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పశువుల పెంపకందారులకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట కొల్లాపూర్ పశువైద్యాధికారి యాదగిరి, సిబ్బంది వెంకటస్వామి ఉన్నారు.