
ఎమర్జెన్సీ పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి!
కందనూలు: ఎమర్జెన్సీ పేరుతో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేసిందని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్ తివారీ మా ట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎమర్జెన్సీ కా లంలో ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కుల ను పాతాళానికి నొక్కడంతో పాటు మీడియా గొంతు నొక్కా రని ఆరోపించారు. కోర్టులు సైతం బెదిరింపులకు లోనయ్యాయని, వేలాది మంది అమాయకులు జై లుశిక్ష అనుభవించారని నాటి రోజులను గుర్తుచేశారు. ఆ సమయంలో జనసంఘ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేసిందన్నారు. అనంత రం ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అరాచకాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, పార్లమెంట్ అభ్యర్థి భరత్‌ప్రసాద్, జిల్లా ఇన్‌చార్జ్ మాదగాని శ్రీనివాస్‌గౌడ్, ప్రమోద్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, ఎల్లేని సుధాకర్‌రావు పాల్గొన్నారు.