
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
బిజినేపల్లి: దేశ భవిష్యత్‌లో కీలకంగా వ్యవహరించే యువతపై చెడు ప్రభావం చూపిస్తున్న మాదక ద్రవ్యాలను నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ అన్నారు. బుధవారం పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల కు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పి ంచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసయి న వారు సమాజం నుంచి తిరస్కరణకు గురవుతున్నారని, అంతేకాక శారీరక, మానసిక, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారి సమాచారం పోలీసు అధికారులకు తెలియజేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు తాగుతున్నట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, సాధారణ స్థితికి మారుస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డా.పుష్పావతి, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సత్యనారాయాణ, సీఐ కనకయ్యగౌడ్, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్