
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అచ్చంపేట రూరల్: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని హాజీపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజా ర్టీతో గెలిపించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, రైతుభరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలను అందిస్తున్నామన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో పాటుపడుతోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.
నిర్వాసితులకు అండగా ఉంటాం..
చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నిర్వాసిత కుటుంబాలు అచ్చంపేటలో ఎమ్మెల్యేను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఇళ్లు, స్థలాలు ఇస్తామని నిర్వాసితులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్‌గౌడ్, మండల అధ్యక్షుడు బాల్‌రాంగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్, నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, గోరటి శివ, మాజీ సర్పంచ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.