
నిత్య జీవితంలో యోగా భాగం కావాలి : కలెక్టర్
భారతీయుల పురాతన సంపద అయి న యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగం కావాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మనసు, శరీరం, ఆత్మల మధ్య సమన్వయాన్ని సాధించే ఒక ప్రాచీన పద్ధతి యోగా అని అన్నారు. దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆందోళన, శారీరక రుగ్మతలకు యోగా ఒక అద్భుతమైన పరిష్కారమని అ న్నారు. ప్రాణాయామం, ధ్యానంతో మనసు స్థిరంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. అనంతరం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమాల్లో ఏఎస్పీ రామేశ్వర్, ఏఆర్ ఏఎస్పీ భరత్, డీఎస్పీలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సీఐలు కనకయ్యగౌడ్, నాగరాజు, నాగార్జున పాల్గొన్నారు.