
నల్లమల రాజసం
వివరాలు 8లో u
అటవీ ప్రాంతాల్లో క్రూరమృగాల నుంచి ఎదురయ్యే ప్రమాదాలు.. వాతావరణ పరిస్థితులను ముందుగానే పసిగట్టగల తెలివితేటలు.. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగే రోగనిరోధక శక్తి.. పొద్దస్తమానం పనిచేసినా అలసిపోనితత్వం.. గుర్రాల వంటి గిట్టలతో ఎత్తైన గుట్టలు, రాళ్లు, రప్పల్లోనూ అవలీలగా పరుగెత్తగల సత్తా నల్లమల లోతట్టు ప్రాంతంలోని పొడజాతి వృషభరాజాల సొంతం.. నిటారుగా ఉండే కొమ్ములు, తెలుపు, ఎరుపు, గోధుమ రంగుల్లో ఉండే మచ్చలే మకుటంగా ధరించిన తూర్పు పొడజాతి పశువులు తెలంగాణ బ్రాండ్‌గా ప్రఖ్యాతి గడించాయి. గిత్తంటే ఇదిరా అనే రైతన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నల్లమల గిత్తగా పేరొందిన ఈ వృషభరాజాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. – అచ్చంపేట
తెలంగాణ బ్రాండ్‌గా తూర్పు పొడజాతి పశుసంపద
● నల్లమల లోతట్టు ప్రాంతంలో మేలుజాతి పశువులు
● మన్ననూర్ గిత్తకు వందేళ్లకు పైగా చరిత్ర
● ఆదరణ కొరవడటంతో ప్రశ్నార్థకమవుతున్న మనుగడ
● ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు కోసం ఎదురుచూపులు