
నేడు డయల్ యువర్ డీఎం
కల్వకుర్తి టౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు వారి సలహాలు, సూచనలను సెల్‌నంబర్ 99592 26292లో సంప్రదించి తెలియజేయాలని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
బడుల బలోపేతంలో
ఉపాధ్యాయులే కీలకం
లింగాల: విద్యా ప్రమాణాలు పెంచడం, నాణ్యమైన బోధన అందించడంలో ఉపాధ్యాయులే కీలకమని.. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని బాకారం, సూరాపూర్, మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని, విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇప్పటికే విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యా ప్రమాణాల పెంపునకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.